calender_icon.png 7 April, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ దేశాలే భారత్ వైపు చూసేలా పరిపాలన

06-04-2025 04:56:55 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ప్రపంచ దేశాలే భారత్ వైపు చూసేలా బిజెపి పరిపాలన కొనసాగుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మర్రి రామ్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం బిజెపి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి పార్టీ ఏర్పడి నేటికీ 45 సంవత్సరాలు పూర్తి చేస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో ఆవిర్భవించిందన్నారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ ముందుకు దూసుకెళ్తుందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు ఉన్న పార్టీగా అంచలంచెలుగా ఎదిగిందన్నారు. కొన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న ఆర్టికల్ 370 ని, త్రిబుల్ తలాక్, రామ్ మందిర్ నిర్మాణం, వక్ బోర్డ్ బిల్లులను నరేంద్ర మోడీ నాయకత్వంలో పరిష్కరించబడ్డాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాపురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, నాయకులు హోటల్ శ్రీను, బిజెపి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, వెంకట్రావు, సదాశివుడు, రవి తదితరులు పాల్గొన్నారు.