02-04-2025 11:30:48 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం సీతారాములకు కోటి గోటి తలంబ్రాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం 14వ సారి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చెందిన శ్రీకృష్ణ చైతన్య సమితి అధ్యక్షుడు కల్యాణ అప్పారావు సీతారాముల తలంబ్రాల కోసం ప్రత్యేకంగా తన ఎకరం భూమిని గోటి తలంబ్రాల కోసం కేటాయించారు. అందుకలో వరి సాగు చేసి మొదట భద్రాచలంకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. ఏడాది పాటు పండిన వరి ధాన్యాన్ని వివిధ రాష్ట్రాలకు భక్తులకు పంపించి రామనామ జపం చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను సిద్ధం చేస్తారు. ఐదు రాష్ట్రాల భక్తులతో కోటి గోటి తలంబ్రాలు తయారు చేయిస్తారు. అప్పారావు బృందం ఏటా వరి ధాన్యాన్ని గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలంలో సమర్పిస్తుంటారు. వీరితో పాటు మరి కొంతమంది భక్తులు కోదండరాముడికి 800 కిలోల గోటి తలంబ్రాలను సమర్పించారు.