02-04-2025 12:49:39 PM
దేవస్థాన అధికారులకు, అర్చకులకు అందజేసిన తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామస్తులు
భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాచలంలో ఏప్రిల్ ఆరో తేదీన జరిగే సీతారాముల కల్యాణానికి ఉపయోగించే గోటి తలంబ్రాలను బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామం నుంచి వచ్చిన భక్తులు దేవస్థానం అర్చకులకు, అధికారులకు అందజేశారు. గత 14 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన కళ్యాణం అప్పారావు నాయకత్వంలోని ఆ గ్రామస్తులు 14 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలను అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా అందజేయడానికి గత జూన్ నెలలో గ్రామస్తులు భద్రాచలం వచ్చి భద్రాద్రి రామయ్య సమక్షంలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని తీసుకెళ్లి పంట పండించారు.
ఏడాది పంట దిగుబడి 800 కేజీలు రాక రాగా వాటిని ఐదు రాష్ట్రాలలో 5 వేల మందితో ఓలిపించి ఈరోజు భద్రాద్రి రామయ్య కు అందజేశారు. కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం పేరుతో గ్రామస్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ భద్రాద్రి వచ్చి దేవస్థానం అధికారులకు అందజేసి రామ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అచ్చుతాపురం గ్రామస్తులు భద్రాద్రి రామయ్య కళ్యాణం తో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణానికి 7 సార్లు అయోధ్యలోని బాల రాముడికి 3 సార్లు గోటి తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గోటి తలంబ్రాల నిర్వాహకులు కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ కళ్యాణం శ్రీ రామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీరామ నామ స్మరణ ద్వారానే మనిషికి ముక్తి లభిస్తుందని, అందరూ రామ తత్వాన్ని అవలంబించాలని ఉద్దేశంతో ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు