calender_icon.png 22 November, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరూమూల గ్రామంలో వికసించిన ఆణిముత్యం

22-11-2024 01:13:32 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం, గిరిజన తండాలో వికసించిన ఆణిముత్యం, నిరుపేద కుటుంబంలో జన్మించిన గుగులోత్ సురేందర్ జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్) విభాగంలో ఉద్యోగం సాధించి ఔరా అనిపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం, బద్ద తండాకు చెందిన గుగులోత్ సురేందర్ పట్టుదలతో చదివి, మ్యాథమెటిక్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించడం చూసి కుటుంబ సభ్యులు, తండావాసులు, టేకులపల్లి మండల వాసులు, అతని గురువులు హర్ష వ్యక్తం చేశారు. గురువారం టి.ఎస్.పి.ఎస్.సి ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో మ్యాథమెటిక్స్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించారు.

శుక్రవారం టేకులపల్లి మండలం కేంద్రంలో తన గురువు వైన టిఎస్టిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసున్నారు. ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా పేదరికాన్ని జయించి, ఉన్నత స్థాయికి ఎదగడానికి గొప్ప ఆయుధమని అన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, నిబద్దత ఉంటే పేదరికాన్ని జయించవచ్చని నిరూపించిన సురేందర్ నాయక్ అని అన్నారు. సురేందర్ విజయం, కమ్యూనిటీకి, మొత్తం సమాజానికి ప్రేరణ అని, అందరికి ఆదర్శం అని అన్నారు. సురేందర్ ని తన గురువు, సేవాలాల్ సేన నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ధరావత్ ప్రేమ్చంద్ నాయక్ గారు,సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా రవి రాథోడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.