calender_icon.png 7 February, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మేరే హస్బెండ్‌కి బీవీ’ చిత్రం నుంచి 'గోరీ హై కలైయాన్' పాట విడుదల

06-02-2025 11:57:40 PM

బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మేరే హస్బెండ్‌కి బీవీ’. 'లవ్ ట్రయాంగిల నహీ.. సర్కిల్ హై' అనేది ఉప శీర్షిక. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ముద్దస్సర్ అజీజ్ దర్శకత్వంలో ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను ర‌కుల్ ప్రీత్ సింగ్ భ‌ర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి తాజాగా గురువారం ఓ పాటను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

'గోరీ హై కలైయాన్' అనే ఈ పాటను బాద్ షా, కనికా కపూర్ పాడారు. దీనికి ఐపీ సింగ్ సాహిత్యం అందించగా, అక్షయ్- ఐపీ ద్వయం స్వరాలను సమకూర్చారు. ఆద్యంతం హుషారెత్తించే స్వరాలతో సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోందీ గీతం. ఇంకా చెప్పాలంటే.. ఈ పాట ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ గీతంగా నిలువనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పెప్పీపెప్పీగా, చాలా ఫిల్మీ వైబ్‌ను కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 21 విడుదల కానుంది.