calender_icon.png 21 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరక్ష మహాపాదయాత్ర

16-12-2024 08:28:29 PM

స్వాగతం పలికిన అయ్యప్ప స్వాములు...

రామయంపేట (విజయక్రాంతి): గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, గోమాత లేనిదే మానవమనుగడ లేదని బాలకృష్ణ గురుస్వామి అన్నారు. గోవుల రక్షణ కోసం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర మెదక్ జిల్లా రామాయంపేట చేరుకుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాలకృష్ణ గురుస్వామి గోమాతతో చేస్తున్న పాదయాత్రకు స్థానిక అయ్యప్ప స్వాములు గణేష్ స్వాగతం పలికారు. సిద్దిపేట చౌరస్తా వద్ద గోమాతకు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎరువులు క్రిమిసంహారక మందులు వాడడం వల్ల విషతుల్యమైన ఆహారం తింటున్నామని తద్వారా ఎంతోమంది అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రతిరోజు 50 వేలకు పైగా ఆవులు వధకు గురవుతున్నాయని, గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నేటికీ 81 రోజులపాటు ఈ పాదయాత్ర పూర్తయిందని 2530 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టు ఆయన తెలిపారు. పాదయాత్రకు స్వాగతం పలికిన అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి, మర్కు నగేష్ గురుస్వామి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, స్థానిక అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.