calender_icon.png 15 October, 2024 | 4:52 AM

గోరఖ్‌పూర్. మహబూబ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు

15-10-2024 02:46:23 AM

 హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ప్రయాణికుల రద్దీ కారణంగా మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ మీదుగా యూపీలోని గోరఖ్‌పూర్‌కు ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వారాంతాల్లో (శని, ఆది వారాల్లో) నడుస్తున్న గోరఖ్‌పూర్ మహబూబ్‌నగర్ గోరఖ్‌పూర్ రైళ్లను నవంబర్ నెలలో ఎగువ, దిగువ కలిపి 10 సర్వీసులను నడిపించనున్నారు.

రైలు నెం. 05303 గోరఖ్‌పూర్ మహబూబ్ నగర్ (నవంబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు కేవలం శనివారాల్లో), రైలు నెం.05304 మహబూబ్‌నగర్4 గోరఖ్‌పూర్ (నవంబర్ 3నుంచి డిసెంబర్ 1 వరకు కేవలం ఆదివారాల్లో) నడుస్తాయి. ఈ రైళ్లు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, మల్కాజ్‌గిరి, కాజీపేట, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, నాగ్‌పూర్, భోఫాల్, ఝాన్సీ, కాన్పూర్ సెంట్రల్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.