27-03-2025 01:16:53 PM
హిందీ తర్వాత దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష గోర్ బోలి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగునున్నాయి. గోర్ బోలి(Gor Boli language ) లంబాడి భాషను 8వ షెడ్యూల్ లో చేర్చాలనే తీర్మానంపై శాసనసభలో చర్చ జరుగుతోంది. హిందీ తర్వాత దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో లంబాడి భాష మాట్లాడతారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు. దేశంలో 700పైగా భాషలు ఉన్నాయి. గోర్ బోలి లంబాడి భాషను కూడా 8వ షెడ్యూల్ లో చేర్చాలి. గోర్ బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాలన్నారు. బంజారా, లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్జప్తి చేశారు.