calender_icon.png 27 January, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ వాలంటీర్ గా ఎంపికైన గోపిక

26-01-2025 06:40:43 PM

కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న ప్రశంస పత్రం...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని శ్రీపతి నగర్ కు చెందిన ఉప్పులేటి గోపిక అక్షరాస్యత కార్యక్రమంలో చేసిన సేవలకు గాను ఉత్తమ వాలంటీర్ గా ఎంపికైంది ఉత్తమ వాలంటీర్ గా ఎంపికైన గోపికను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోనీ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. పట్టణంలోని శ్రీపతి నగర్ లో అక్షరాస్యత కేంద్రం, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేసి కోఆర్డినేటర్ గా సేవలందిస్తూ వయోజన మహిళలు విద్య నేర్చుకునేలా ప్రోత్సహించడంతో పాటు, మహిళా సాధికారత సాధన కోసం, వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నందుకు గాను ఉత్తమ వాలంటీర్ ప్రశంస పత్రం అందుకున్నారు. ఇదిలా ఉండగా ఉత్తమ వాలంటీర్ గా ఎంపికైన గోపికను కాలనీ వాసులు అభినందించారు. మరిన్ని ఉత్తమ సేవలు అందించి అవార్డులు సాధించాలని వారు కోరారు.