calender_icon.png 7 October, 2024 | 2:57 AM

గోపిచంద్ సైలెంట్.. నేను సరదాగా ఉంటా

07-10-2024 12:12:00 AM

నా పాత్ర కోసం చాలా కేర్ తీసుకున్నాం 

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి గోపిచంద్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కావ్యథాపర్ ఆదివారం విలేకకరులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. 

విశ్వంలో యూనిక్ పాయింట్ ఏమిటి?

కథే యూనిక్ పాయింట్. దర్శకుడు తీసిన విధానం యూనిక్. కేవీ మోహన్ కెమెరా పనితం యూనిక్. ఇందులో నేను గ్రే తరహా పాత్ర చేశాను. అది కూడా యూనికే. ఒకరకంగా చెప్పాలంటే విశ్వంలోనే అన్నీ ఉన్నాయి.

ఈ చిత్రం మీకు ఎంత వైవిధ్యంగా ఉండబోతోంది?

విశ్వంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. మల్టీపుల్ లొకేషన్స్, నటీనటులు. దాదాపు 16 మంది కమెడియన్స్ ఇందులో భాగమయ్యారు.  

పాత్ర పరంగా మీకు ఛాలెంజింగ్ అనిపించిన అంశాలేవి?

నా క్యారెక్టరే భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటారు. సిట్యువేషన్ పరంగా సన్నివేశాన్ని వివరించే విధానంలో కొత్తదనం చూపారు. నాది చాలా స్టయిలిష్ క్యారెక్టర్. నేను ఇందులో కాస్ట్యూమ్స్ డిజైనర్ పాత్రలో నటించా. మోడ్రన్‌గా ఉండే నేటి ట్రెండ్‌కు తగిన అమ్మాయి క్యారెక్టర్ నాది. అందుకే కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. 

ఫిజికల్ చాలెంజ్ అనిపించిన సందర్భాలు..?

ఔట్ డోర్ షూట్‌లో చాలా చాలెంజింగ్ అనిపించింది. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు, హిమాచల్ వంటి చోట్ల మైనస్ డిగ్రీలలో వాతావరణ ఉన్నప్పుడు యాక్ట్ చేయడం అనేది ఫిజికల్ చాలెంజ్. అవన్నీ చూసుకుని దేనికైనా రెడీ అన్నట్లుగా చేయగలిగా.   

గోపీచంద్‌తో నటిచడం ఎలా అనిపించింది?

నేను చాలా ఫాస్ట్‌గా జోవియల్‌గా ఉంటాను. గోపీచంద్ గారు చాలా కామ్‌గా ఉంటారు. సెట్లో చాలా సైలెంట్. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన క్యారెక్టర్ నాది. అందుకే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మాడ్యులేషన్ పరంగానైతే, సిస్టమేటిక్ విషయాలన్నీ గ్రహించాను. ఒకరకంగా తెలుగు కూడా నేర్చుకున్నా.

దర్శకుడి గురించి ఏం చెబుతారు?

శ్రీనువైట్ల గారి డెడికేషన్‌కు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీనుగారి వల్లే నేను బాగా నటించగలిగాను. అంతా సహజంగా వచ్చేలా చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏమంటే అందరి పాత్రలనూ ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించేవారు. అలా నా పాత్రపరంగా చెబుతూ నా శైలిని మలుచుకునేలా చేశారు.

పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో చేయడం ఎలా అనిపించింది?

నిర్మాణ విలువలు చాలా హైలో ఉన్నాయి. చాలా కేర్ తీసుకున్నారు. హిమాచల్, మనాలి వంటి చోట్ల మంచు ప్రాంతాల్లో వర్క్ చేయడం చాలా కష్టం. అంత కష్టమైన ప్రాంతాల్లో చాలా ప్రికాషన్స్ తీసుకునేలా వారు సహకరించారు. చాలా మంది టీమ్‌ను అక్కడికి రప్పించి, సినిమా బాగా వచ్చేలా చేశారు.  

ఎలాంటి పాత్రలు చేయాలనుంది?

ఇందులో గ్లామర్ పాత్ర చేశాను. నటిగా అన్ని పాత్రలూ చేయాలనుంది. ఎలాంటి టఫ్ పాత్రనైనా చేస్తానే ధైర్యం కూడా వచ్చేసింది. సైకో కిల్లర్ తరహా పాత్రలు చేయడం టప్. కానీ అవి కూడా చేస్తా. నటిగా పాత్రకు న్యాయం చేయాలని నమ్ముతా.

సక్సెస్, ఫెయిల్యూర్‌లను ఏవిధంగా చూస్తారు? 

అది నా చేతుల్లో లేదు. నావరకు నేను పాత్రకు న్యాయం చేస్తాను. ఇచ్చిన పాత్ర కోసం కష్టపడి పనిచేయడమే తెలుసు. మిగిలింది దేవుడిపై భారం వేస్తా. నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?!