25-04-2025 12:00:00 AM
హీరో గోపీచంద్ మరో సినిమాను మొదలుపెట్టేశారు. శ్రీవేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. గోపీచంద్ ‘సాహసం’ తర్వాత మరోమారు ఈ బ్యానర్‌లో చేస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్టు గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో కుమార్‌సాయి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, భారీ బడ్జెట్‌తో, అత్యుత్తుమ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మలయాళ నటి మీనాక్షి దినేశ్ ఇందులో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు.
శామ్‌దత్ డీవోపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.