calender_icon.png 31 January, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపి సుందర్‌కు మాతృ వియోగం

31-01-2025 12:00:00 AM

సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేశ్‌బాబు (65) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కేరళలోని కూర్కెంచెరిలో అజంతా అపార్ట్‌మెంట్‌లో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గురువారం వడూకర శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

తన తల్లి మరణ వార్తను గోపి సుందర్ స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. తన తల్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ, తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘అమ్మా, నువ్వు నాకు జీవితం, ప్రేమ, నా కలలను అనుసరించే శక్తిని అందించావు. నేను సృష్టించే ప్రతి సంగీత స్వరంలో నువ్వు నాలో కురిపించిన ప్రేమ ప్రతిఫలిస్తుంది. నువ్వు నా హృదయంలో, నా సంగీతంలో, నేను వేసే ప్రతి అడుగులో జీవిస్తావు.

నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. మాలయాళం సినీ పరిశ్రమ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపి సుందర్ తెలుగులో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘ఊపిరి’, ‘మజిలీ’, ‘నిన్ను కోరి’, ’18 పేజెస్’ వంటి సినిమాలకు సంగీత సారథ్యం వహించారు.