07-04-2025 03:12:13 PM
లక్షెట్టిపేట, విజయక్రాంతి: మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా గోపతి సురేష్(Gopathi Suresh) సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ... మండలంలో నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు చెడు వ్యాసనాలను దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.