calender_icon.png 23 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గోపాల్ పేట విద్యార్థులు ఎంపిక

23-04-2025 12:41:39 AM

గోపాలపేట ఏప్రిల్22 : జాతీయస్థాయి అండర్ 14వ విభాగం ఫుట్బాల్ పోటీలకు గోపాలపేట విద్యార్థులు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని కొలహాపూర్ పట్టణంలో జరుగు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు గోపాల్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నలుగురు ఎంపిక కావడం జరిగింది.

ఫిబ్రవరి నెలలో వనపర్తి లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది ఎంపికైన క్రీడాకారులు బాబు ఓంకార్ మాధవి లావణ్య ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాందేవ్ రెడ్డి గారు పిడి సురేందర్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం మరియు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.