calender_icon.png 26 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడిగా గోపాల్ ముదిరాజ్

26-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి 25: బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడిగా 8 వ వార్డు మాజీ కౌన్సిలర్ కుమ్మరపల్లి గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వికారాబాద్ మునిసిపల్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గోపాల్ ముది రాజు ను పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులు అందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా పనిచేస్తూ ముందుకు సాగాలని ఆనంద్ సూచించారు.

అనంతరం పట్టణ అధ్యక్షుడిగా ఎంపికైన గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేస్తానన్నారు.