calender_icon.png 27 December, 2024 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో గూగుల్‌ భారీ పెట్టుబడులు

04-12-2024 05:04:15 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గూగుల్ ప్రతినిధులు బుధవారం కలిశారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిసి చర్చలు జరిపారు. ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా రేవంత్ సర్కార్ ఒప్పించింది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. దేశంలోనే అతిపెద్ద జీఎస్ఈసీ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ నగరంలో నెలకొననుంది. డిజిటల్ స్కిల్ డెవలప్ మెంట్ లో తెలంగాణ ముందు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని రేవంత్ వెల్లడించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని సీఎం రేవంత్ వెల్లడించారు.