* మ్యాప్స్‌ను నమ్మి అడవుల్లో ఇరుకున్న కుటుంబం
* అర్థరాత్రి అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన భాదితులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ప్రామణికంగా లేని గూగుల్ మ్యాప్స్‌తో ప్రజలు తంటాలు పడుతున్నారు. కొన్ని రోజుల కింద గూగుల్ మ్యాప్స్ నమ్మడం వల్ల జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ కుటుంబం రూట్ తెలియక రాత్రంతా కర్ణాటక అడవుల్లో చిక్కుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన రణజిత్ దాస్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉజ్జయిని నుంచి గోవాకు బయలుదేరాడు. మ్యాప్ సహాయంతో కారు నడుపుతుండగా.. అది వారిని నేరుగా అడవిలోకి తీసుకెళ్లింది. ఫోన్లకు సిగ్నళ్లు రాకపోవడంతో వారు రాత్రంతా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో బయటపడ్డారు. కాగా ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ తప్పుగా సూచించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి పడి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే.