calender_icon.png 20 November, 2024 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విక్రయానికి గూగుల్ క్రోమ్?

20-11-2024 12:07:23 AM

వాషింగ్టన్, నవంబర్ 19: సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్‌ను అమ్మేలా దాని మాతృసంస్థపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రోమ్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌ను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) కోరనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. తిరుగులేని గుత్తాధిపత్యం వహిస్తూ మార్కెట్‌ను శాసిస్తున్న గూగుల్‌కు చెక్ పెట్టడానికి డీవోజే ప్రయత్నం చేస్తున్నది.

మార్కెట్‌లో అక్రమంగా గూగుల్ గుత్తాధి పత్యం సాధించిందని ఆగస్టులో అమెరికా కోర్టు జడ్జి రూలింగ్ ఇచ్చారు. ఈ వార్తా కథనాలపై వ్యాఖ్యానించడానికి డీవోజే నిరాకరించింది. డీవోజే నిర్ణయంపై గూగుల్  కంపెనీ ప్రతినిధి మండిపడ్డారు. డీవోజే ఓ ర్యాడికల్ ఎజెండాతో ముందుకు వచ్చి చట్టాల పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. డీవోజే నిర్ణయంతో వినియోగదారులకు తీవ్ర నష్టం కలుగు తుందని తెలిపింది.

టెక్నాలజీ విషయంలో పెద్ద పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని నిలువరించడానికి బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. అలాగే గూగుల్ తన విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని  ట్రంప్ కూడా గతంలో ఆరోపించారు. అయితే ఆ కంపెనీని రెండు ముక్కలుగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.