మంథని, జూన్4(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లలిత ఆధ్వర్యంలో గురువారం ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని అధికారులు ఎంపీపీ జక్కుల ముత్తయ్యను, జడ్పీటీసీ చెలకల స్వర్ణలతను, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీలు మాట్లాడుతూ.. ఐదేళ్లు తమకు సహకరించిన అధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుమన్, వైస్ ఎంపీపీ రవీందర్‌రావు, ఎంపీవో వేణుమాధవ్, ఎంపీటీసీలు దొడ్డ గీతరాణిబా లాజీ, అల్లం తిరుపతి, బియ్యాని శ్యామలసదానందం పాల్గొన్నారు.