calender_icon.png 23 February, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ సీఈవో పదవికి జియోఫ్ అల్లార్డుసై గుడ్ బై

28-01-2025 11:35:39 PM

దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ సీఈవో పదవి నుంచి జియోఫ్ అల్లార్డుసై తప్పుకున్నాడు. 2012లో ఐసీసీలో జనరల్ మేనేజర్ ఆఫ్ క్రికెట్ పదవికి ఎంపికైన జియోఫ్ ఆ తర్వాత క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాడు. అనంతరం నవంబర్ 2021లో ఐసీసీ సీఈవోగా బాధ్యతలు చేపట్టాడు. కాగా మంగళవారం ప్రకటన విడుదల చేసిన ఐసీసీ అధికారులు జియోఫ్ రాజీనామాకు సంబంధించి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఐసీసీ చైర్మన్ జై షా మాత్రం అల్లార్డుసై సేవలను కొనియాడారు.

‘ఐసీసీకి జియోఫ్ అందించిన సేవలు మరువలేనివి. కష్టకాలంలో అతను యాక్టింగ్ సీఈవోగా పని చేశాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా క్రికెట్‌ను గ్లోబల్‌గా మరింత ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యపాత్ర పోషించారు. మీ సేవకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని జైషా పేర్కొన్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ర్యాంకింగ్స్‌లో టాప్ ఉన్న దేశాలు టోర్నీలో పాల్గొంటున్నాయి. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లన్నింటిని దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే.