రాజేంద్రనగర్, ఫిబ్రవరి 2: మల్లన్న స్వామి కళ్యాణం కమనీ యంగా కొనసాగింది. ఆదివారం శంషాబాద్ మున్సిపాలిటీలోని సి ద్ధాంతిలో నిర్వహించిన మల్లన్న జాతర, కళ్యాణం వైభవంగా నిర్వహిం చారు. శంషాబాద్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం లో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిత్యం కొంత సమయాన్ని దైవచింతనకు కేటాయించాలి అన్నారు. స్వామివారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.