calender_icon.png 10 October, 2024 | 1:48 PM

వింక్ మ్యూజిక్‌కు ఎయిర్‌టెల్ గుడ్‌బై

28-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 27: భారతి ఎయిర్‌టెల్ తన మ్యూజిక్ వెర్టికల్ నుంచి వైదొలుగుతుంది. వింక్ మ్యూజిక్ యాప్‌ను మూసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు నెలల్లో వింక్ మ్యూజిక్‌ను మూసివేయాలని ఎయిర్‌టెల్ యోచిస్తున్నదని, ఆ యాప్ ఉద్యోగులను కంపెనీలోకి తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి సైతం ఈ వార్తను ధృవీకరించారు. ఇక నుంచి ఎయిర్‌టెల్ యూజర్లకు యాపిల్ మ్యూజిక్ యాక్సెస్‌లో వస్తుందని, ఐఫోన్లు వాడే వింక్ ప్రీమియం యూజర్లకు యాపిల్ మ్యూజిక్ కోసం ఎయిర్‌టెల్ నుంచి ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని ఆ ప్రతినిధి చెప్పారు. యాపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకునేందుకు యాపిల్‌తో ఎయిర్‌టెల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.