calender_icon.png 19 January, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ

12-07-2024 01:49:15 AM

హైదరాబాద్, జూలై 11 ( విజయక్రాంతి) : కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం బండి నివాసానికి పూలబొకే, గ్రీటింగ్స్ పంపించి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  ఆస్ట్రేలియా పార్లమెంట్ ఫైనాన్స్ అండ్ ఎకనా మిక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ డేనియల్ ములినో అభినందనలు తెలియజేశారు. సంజయ్ ఆస్ట్రేలియాలో పర్యటించా లని ఆహ్వానించారు. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ కొండ, విక్టోరియా రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సాయిని రాజ్ కుమార్‌లు సంజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.