నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రతిరోజు సమయానికి భోజనం చేసి మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచి చదువులు వస్తాయని జిల్లా పరీక్షల సహాయ కన్వీనర్ పద్మ అన్నారు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన ఆహార పదార్థాలను అందులో ఉన్న పోషక విలువలను ఆమె విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.