19-03-2025 05:28:26 PM
విద్యార్థులకు డిఇఓ డిపిఆర్ఓ ల పిలుపు..
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. గొల్ల బుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.... విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయంగా తీర్చిదిద్దుకోవచ్చుని అన్నారు. పరీక్షా ప్యాడ్, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులకు వ్రాసిన అందరు చదవాలి.
అందరూ ఎదగాలి అనే ప్రేరణ కరపత్ర సందేశాన్ని సిరి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు చదివి వినిపించగా, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజ్ గోపాల్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ సునీత, విద్యార్థుల తల్లిదండ్రులు, తొమ్మిదవ తరగతి విద్యార్థులు, డిఎన్టిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుహాసిని విద్యార్థులు పాల్గొన్నారు.