మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13(విజయక్రాంతి): ఎక్సైజ్‌శాఖ అభివృద్ధికి సమిష్టిగా కృషిచేయాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చెవ్వూరు హరికిరణ్, ఓఎస్‌డీ రాజేందర్‌తో కలిసి నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పురోగతిపై చర్చించి మద్యం తయారీ, అమ్మకాలు, నిల్వలపై ఆరా తీశారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు, ఇతర అంశా లపైనా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సమావేశంలో ఎక్సై జ్ జాయింట్ కమిషనర్ ప్రణవి, బేవరేజేస్ కార్పొరేషన్ జీఎం అబ్రహం, జా యింట్ కమిషనర్ కేఏబీశాస్త్రి, అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు పాల్గొన్నారు.