నిర్మల్ (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని చించోలి బి సారంగపూర్ దని నిర్మల్ అర్బన్ తదితర పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులతో మాట్లాడారు. మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.