16-04-2025 01:35:14 AM
జూనియర్ సివిల్ జడ్జి పావని
జగిత్యాల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): బార్ కౌన్సిల్, బెంచ్ మధ్య సత్సంబంధాలు నెలకొనాలని కోరుట్ల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పావని కోరారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణలో మంగళవారం జరిగిన నూతన బార్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేసులు త్వరగా పరిష్కారరమయ్యేలా న్యాయవాదులు తగిన సహకారాన్ని అందించాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కోరుట్ల కోర్టులో లైబ్రరీ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానన్నారు.
తన తండ్రి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నూతన కోర్టు భవన నిర్మాణానికి 2 ఎకరాల స్థలం మంజూరు చేయించారన్నారు. కాగా కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కస్తూరి రమేష్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, సంయుక్త కార్యదర్శి చిలువేరి రాజశేఖర్, ట్రెజరర్ చింతకింది ప్రేమ్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శి ఫసియోద్దీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సదానంద నేత, సదాశివ రాజు, జూనియర్ మెంబర్లు నరేందర్, శ్రవణ్య దీప, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికల అధికారులుగా ముబీన్ పాషా, మచ్చ వెంకట రమణ మూర్తి, సంగ విజయ్ సాయి వ్యవహరించారు. జడ్జ్ పావని , కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలను జడ్జి, ఎమ్మెల్యే, బార్ కౌన్సిల్ సభ్యులకు ప్రముఖ న్యాయవాదులు తోకల రమేశ్, రొడ్డ సౌమ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బద్ది నర్సయ్య, తన్నీర్ శ్రీనివాసరావు, సుతారి నవీన్, వనపర్తి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.