17-04-2025 01:25:13 AM
డీఆర్‌డీఓ సురేందర్
తాడ్వాయి, ఏప్రిల్, 16( విజయ క్రాంతి): ఉద్యానవన పంటలతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని డిఆర్డిఓ సురేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉపాధి హామీలో ఉద్యానవన పంట లు పెంచుకునే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు.
తాడ్వాయి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఉద్యానవన పంట అయిన మునగ పంటను ఆయన అంతకుముందు పరిశీలించారు మొక్కల పెంపకం మునక్కాయలు దిగుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు ఒక్కో ఎకరాలో వెయ్యి మొక్కలు నాటినట్లు రైతు తెలిపారు.
మునక్కాయలకు రూ.2000 చొప్పున డబ్బులు వస్తున్నాయని రైతు సంతోషం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు రైతులు ఇంకా ఎక్కువ సాగు చేయడానికి సిద్ధమైతే వారికి కూడా అవకాశం ఇస్తామని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపీ ఓ సవిత,ఏపీవో కృష్ణ గౌడ్, టీఏ లు స్వామి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు