28-03-2025 12:10:56 AM
ఉబెర్, ఓలాకు పోటీగా ‘సహకార్ ట్యాక్సీ’
లోక్‌సభలో ప్రకటించిన హోంమంత్రి అమిత్ షా..
డ్రైవర్లు నేరుగా లాభాలు పొందే అవకాశం..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా గురువారం ట్యాక్సీ డ్రైవర్లకు శుభావార్త చెప్పారు. ఉబెర్, ఓలాకు పోటీగా ‘సహకార్ ట్యాక్సీ’ పేరిట కొత్త ట్యాక్సీ సర్వీసును ప్రారంభించనున్నట్లు లోక్‌సభ వేదికగా ప్రకటించారు. ‘సహకార్ ట్యాక్సీ’ నడిపే డ్రైవర్లు ఇకపై ఎవరికి కమిషన్లు చెల్లించకుండా నేరుగా లాభాలు పొందే అవకాశముంది. ఓలా, ఉబర్, ర్యాపిడో నడిపించే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టపోతున్నామని డ్రైవర్లు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.
సహకార్ ట్యాక్సీ ద్వారా పెద్ద కంపెనీలకు లాభాలు ఇవ్వకుండా డ్రైవర్లు నేరుగా సంపాదించడంలో సహాయపడటమే దీని లక్ష్యమన్నారు. రైడ్ నుంచి వచ్చిన లాభం నేరుగా డ్రైవర్‌కే వెళ్తుందని పేర్కొన్నారు. ప్రజలకు చౌక రవాణా సేవలను అందించడమే ‘సహకార్ ట్యాక్సీ’ ప్రధాన లక్ష్యం. ప్రధాని మోదీ విజన్‌గా చెప్పుకునే ‘సహకార్ సే సంవృద్ధి’లో ఇది భాగమని అమిత్ షా వెల్లడించారు.