18-02-2025 01:36:52 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ముస్లిం ఉద్యోగులు రంజాన్ మాసం సందర్భంగా గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారు మతపరమైన ప్రార్థనల్లో పాల్గొనేందుకు వీలవుతుందని భావించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా ఉద్యోగులు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉండగా, ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ఉద్యోగులు మార్చి 2వ తేదీ నుంచి ఇదే నెల 31 వరకు సాయంత్రం 4 గంటలకే ఇంటికి వెళ్లేందుకు అనుమతులు వచ్చాయి. ఈ వెసులుబాటు ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లందరికీ వర్తిస్తాయని సీఎస్ పేర్కొన్నారు.