calender_icon.png 15 January, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీపి కబురు

14-01-2025 12:35:18 AM

ఫిబ్రవరిలో వేతనాల పెంపు..!

బెంగళూరు:  కొత్త ఏడాది దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’  తన ఉద్యోగులకు  తీపి కబురు చెప్పనున్నట్లు తెలిసింది. అతి త్వర లో ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటిం చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేర కు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీ య మీడియాలో వరుస కథనాలు వస్తున్నా యి. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల నుంచే వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన లెటర్స్ ఫిబ్రవరిలో ఉద్యోగుల చేతికి అందుతాయని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.

వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలిసింది. జాబ్ లెవల్ 6 ఆపై ఉన్న వారికి మార్చిలో వేతనాల పెంపునకు సంబంధించిన లేఖలు అందనున్నాయని తెలుస్తోంది. అయితే జీతాల పెంపు వార్తలపై ఇన్ఫోసిస్( ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది. జేఎల్5లో సాఫ్టువేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టం ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు.