టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా టికెట్ ధరలను పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. ఇందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అదనపు షోలకు కూడా ప్రభుత్వం అవకాశమిచ్చింది. దేవర సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. తొలిరోజు ఒక్కో టికెట్‌పై రూ.100, తర్వాత తొమ్మిది రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ.50, సింగిల్ స్క్రీన్‌లలో గరిష్టంగా రూ.25 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే, అదనపు షోల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీనిచ్చింది. విడుదలైన పదిరోజుల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. తొలిరోజు ఆరు షోలకు.. తొమ్మిది రోజుల పాటు ఐదు షోలను ప్రదర్శించుకునేలా ఆదేశాలిచ్చింది.