calender_icon.png 1 November, 2024 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుణ్య నియామకాల అభ్యర్థులకు త్వరలో తీపి కబురు

01-11-2024 02:13:23 PM

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా...

గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే... 

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు

మారం జగదీశ్వర్ 

కరీంనగర్, (విజయక్రాంతి): జిల్లా పరిషత్ కారుణ్య నియామక అభ్యర్థులకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, వారందరికీ సత్వర న్యాయం జరిగే దిశగా సమస్యను మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్  దృష్టికి తీసుకు వెళ్తానని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవన్ లో దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పి కారుణ్య నియామక అభ్యర్థులు   టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ను శుక్రవారం కలిశారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశ ఎజెండాలో, జడ్పీ కారుణ్య నియామకాల  అంశాన్ని పొందుపరిచే విధంగా  మంత్రులతో మాట్లాడనున్నట్టు ఆయన తెలిపారు.

ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి  త్వరలో తీపి కబురు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జెడ్పి కారుణ్య నియామక అభ్యర్థులు ఎన్జీవో సంఘ నాయకులు  మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సర్దార్ హర్విందర్ సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోటా రామస్వామి, నోముల రాహుల్ రెడ్డి, భాగ్య, సతీష్ , రఘురాం రెడ్డి, సతీష్, విశాల్, నచ్చికేత్, పృధ్విరాజ్, అజిత్, షాహెబాజ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.