calender_icon.png 30 October, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ ముందు పసిడి శుభవార్త!

29-10-2024 12:27:19 AM

హైదరాబాద్: ధన త్రయోదశి, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పసిడి ధరలు సోమవారం దిగివచ్చాయి. మూడు రోజుల తర్వాత బంగారం రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులకు ఉపశ మనం లభించింది.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.450 దిగివచ్చి రూ.73,150 లకు చేరింది.

24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి రూ. 80,290 వద్దకు వచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గింపును నమోదు చేశాయి.ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈరోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.

22 క్యారెట్ల బం గారంపై రూ.450, అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.490 క్షీణించింది. ప్రస్తు తం వీటి ధరలు వరుసగా రూ.73,300, రూ.79,950 వద్దకు వచ్చి చేరాయి. దేశంలో వెండి ధరలు సోమవారం నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.