calender_icon.png 7 February, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రమించి చదివినప్పుడే మంచి మార్కులు సాధ్యం

07-02-2025 05:41:32 PM

తుంగతుర్తి: విద్యార్థులు కష్టపడి శ్రమించి చదివినట్లయితే సర్వం సాధ్యంతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మండల విద్యాశాఖ అధికారి బోయిన లింగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు సమాజంలో ఉపాధ్యాయుడికి ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళిక బద్ధంగా చదువును ఇష్టపడి చదివినట్లయితే తాము అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చు అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని కోరారు.

అంతకుముందు విద్యార్థులు వేసిన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గవర్నర్, రాష్ట్ర కేంద్రమంత్రులు పాత్ర పోషించడంతో పాటు మెయిన్ రోడ్ పై కార్లతో కాన్వాయ్ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. వారు వేసిన వేషధారణలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ మేరకు ప్రిన్సిపాల్ గా అర్ఫత్ పాషా, కరస్పాండెంట్ గా శ్రీనివాస్, రాష్ట్రపతిగా గోపగాని పృద్వి, ఉపరాష్ట్రపతిగా తేజస్విని పాల్గొన్నారు.