calender_icon.png 1 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోదాల శుభం

31-03-2025 12:10:13 AM

స్టార్ హీరోయిన్ సమంత సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించగా, వసంత్ మరిగంటి కథ అందించారు. ఈ సినిమాలో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంతం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి నటించారు.

‘బామ్మ మాట వినేద్దాం.. అర్జెంట్‌గా టీజర్ రిలీజ్ చేసేద్దాం’ అంటూ సోషల్ మీడియాలో ఇటీవల మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఫన్నీ, హారర్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మృదుల్ సుజిత్ సేన్; సంగీతం: క్లింటన్ సెరెజో; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: వివేక్ సాగర్; ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల.