calender_icon.png 12 December, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్కౌంట్లకు మంగళం!

12-12-2024 12:46:29 AM

  1. ఈ ఏడాది ట్రాఫిక్ ఫైన్లపై రాయితీలు బంద్? 
  2. డిస్కౌంట్ ఆఫర్లతో వాహనదారుల్లో కానరాని భయం
  3. క్రమశిక్షణ చర్యలే మేలంటున్న ట్రాఫిక్ అధికారులు
  4. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో 3 కోట్లకు పైగా చలాన్లు
  5. వాహనదారులు కట్టాల్సిన ఫైన్ రూ.1186 కోట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): వాహనదారులకు ఈ ఏడాది షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ ఏడాది వాటిని ప్రకటించే అవకాశం లేనట్టు తెలుస్తోంది.

ప్రతిసారి భారీ డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల వాహనదారుల్లో భయం కనిపించడంలేదని.. ఇష్టారీతినా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ, ప్రమాదాలకుప్రధాన కారణమవుతున్నారని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించవద్దని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.

దీంతో ఇకపై వాహనాల పెండింగ్ చలాన్లపై ఉన్న పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిందేనని అధికా రులు స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై ఉక్కుపాదం మోపుతామని.. వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచె ప్తున్నారు.

వాహనదారుల్లో మార్పు కోసం మరిన్ని క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తామని చెప్పారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.26 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండగా.. వాటిపై రావాల్సిన బకాయిలు మొత్తం రూ.1,186 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

వాహనదారుల ఎదురుచూపులు 

ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ట్రాఫిక్ యంత్రాంగం భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుందని వాహనదారులు వేచి చూస్తున్నారు. రూ.వేలల్లో పెరుకుపోయిన చలాన్లు చెల్లించడానికి భారీ డిస్కౌంట్లు బాగా ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.

మరికొంత మంది వాహనదారులు మాత్రం ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించకపోవడమే ఉత్తమమని.. ఈ డిస్కౌంట్లతో వాహనదారులకు భయం లేకుండా పోతోందని, విచ్చలవిడిగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని పేర్కొంటున్నారు. 

మొండి బకాయిదారులపై చార్జీషీట్లు

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జరిమానాలు విధిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించేలా యజమానులకు సూచిస్తున్నారు.

మరికొందరు వారి చిరునామా ఆధారంగా మొదటగా నోటీసులు పంపించి పెండిండ్ చలాన్లు చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ చెల్లించనియెడల కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10  వరకు రాష్ట్ర వ్యాప్తం గా 1.54 కోట్ల చలాన్లు విధించామని, వాటిపై మొత్తం బకాయిలు రూ.523, 87,26,145 కోట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.   

గతంలో డిస్కౌంట్ ఆఫర్లతో 

వాహనాలపై పెరుకుపోయిన పెం డింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు గతంలో ట్రాఫిక్ పోలీసులు డిస్కౌం ట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులకు 90 శాతం.. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. కార్లు, భారీ వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి 2022- 23లో 2.85 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించగా రూ.303.46 కోట్లు వసూలయ్యాయి. అలాగే 2023 1.67 కోట్ల చలాన్లు చెల్లించగా రూ.150.96 కోట్లు వసూలు అయ్యాయి.