రోదసి యాత్రకు భారత వ్యోమగామి నిర్ధారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 2: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా త్వరలో చేపట్టబోయే రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న భారత వ్యోమగామిని ఎంపిక చేశారు. వ్యోమగాములుగా శిక్షణ పొందుతున్న భారత్‌కు చెందిన వ్యక్తుల్లో అతి పిన్న వయస్కుడైన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాన వ్యోమగామిగా నిర్ణయించారు. ఈయన త్వరలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అంతరిక్షయాత్రకు వెళ్లేందుకు ఎంపిక చేసేవారిని ప్రధాన వ్యోమగామి, బ్యాకప్ వ్యోమగామి అని వర్గీకరిస్తారు. ప్రధాన వ్యోమగామిని రోదరి యాత్రకు పంపుతారు.
ఏదైనా అనుకోని సమస్య వచ్చి ప్రధాన వ్యోమగామి వెళ్లలేకపోతే, బ్యాకప్ వ్యోమగామిని పంపుతారు. బ్యాకప్ వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఎంపికచేశారు. శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985, అక్టోబర్ 10న జన్మించాడు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2006 జూన్ 17న భారత వైమానిక దళంలోని పోరాట దళంలో చేరాడు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలట్‌గా దాదాపు 2 వేల గంటలపాటు యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉన్నది.