పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ అడుగుజాడల్లో నడుస్తూ.. మట్టికోటపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటున్న అల్కరాజ్ హోరాహోరీ సెమీస్‌లో సత్తాచాటాడు. శుక్రవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అల్కరాజ్ 2 6 3 6 6 రెండో సీడ్ జానిక్ సిన్నెర్‌పై విజయం సాధించాడు. నిరుడు సెమీఫైనల్లో ఓటమి పాలైన అల్కరాజ్.. ఈ సారి శక్తినంతా కూడగట్టుకొని చెలరేగిపోయాడు.
తొలి మూడు సెట్లలో రెండింట ఓడిన అల్కరాజ్.. ఆ తర్వాత తనలోని పోరాట యోధుడిని తట్టిలేపాడు. చివరి రెండు సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించాడు. 4 గంటలకు పైగా సాగిన పోరులో 8 ఏస్‌లు బాదిన అల్కరాజ్.. 65 విన్నర్లు కొట్టాడు. సుదీర్ఘ వ్యాలీలతో సిన్నర్ సహనానికి పరీక్ష పెట్టిన అల్కరాజ్.. అదునుచూసి డ్రాప్ షాట్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఒక దశలో సిన్నెర్ విజయం నల్లేరుపై నడకే అనిపించినా.. తిరిగి పుంజుకున్న అల్కరాజ్ అభిమానుల సందడి మధ్య విజయనాధం చేశాడు. రెండో సెమీస్ విజేతతో ఆదివారం అల్కరాజ్ టైటిల్ కోసం తలపడనున్నాడు.
ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు
చెలరేగుతుంటే.. భగభగ మండే సూరీడు కూడా వీరి ప్రదర్శన ముందు మసకబారిపోయాడు. నడినెత్తిన ఎర్రటి ఎండ నిప్పులు కక్కుతుంటే.. ఎర్ర మట్టికోటపై పట్టు కోసం.. టాప్ సీడ్ ప్లేయర్లు విజృంభించారు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇద్దరు టాప్ సీడ్ ప్లేయర్ల మధ్య జరిగిన సెమీఫైనల్ పోరు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీస్ మ్యాచ్‌లో చివరకు స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కారాజ్ జానిక్ సిన్నర్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు.