హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం సుపరిపాలనా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాళులర్పించారు.
అనంతరం నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ ఎమ్మెల్మే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు తదితరులు పాల్గొన్నారు.