19-04-2025 01:56:21 AM
40 రోజుల క్రైస్తవ ఉపవాస ప్రార్ధనలు
కోదాడ, ఏప్రిల్ 18: స్థానిక కోదాడ పట్టణంలోని నయనగర్ లో ఉన్న బాప్టిస్ట్ చర్చిలో శుక్రవారం ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరిగాయి. 40వ రోజు గుడ్ ఫ్రైడే ఆరాధన పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఈ ఆరాధనలో ప్రత్యేకంగా యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలు ఏడుగురు వక్తలు మాట్లాడి ఏసుప్రభు యొక్క ప్రేమను చాటి చెప్పారు. ఏసుప్రభు లోక కళ్యాణ నిమిత్తము కలవరి సిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తము ద్వారా లోక పాపములను కడిగి వేసి లోక పాపములనుమోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా అవతరించి ఉన్నాడని వారు కొనియాడారు.
అనంతరం సంఘ గాయని గాయకులు ప్రత్యేకమైన పాటలు పాడి దేవుని మహిమ పరిచారు. మహిళలు యవనస్తులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి దేవుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరమ్మ, సుమలత, కోటయ్య, జ్యోతి,శారా, మాజీఎంపీపీ యాతాకుల జ్యోతి కోదాడ క్రిస్టియన్స్ కో ఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి యేసయ్య, ద్రాక్షవల్లి, జగ్గు నాయక్, జాన్ శ్యామ్ బాబు, రాంబాబు, విజయనం ద్, మోజస్ పాల్గొన్నారు