calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

19-04-2025 01:01:06 AM

చేగుంట, ఏప్రిల్ 18 :చేగుంట మండల పరిధిలోని చేగుంట, చందాయిపేట్, మక్కరాజపేట, వడియారం, పొ లంపల్లి గ్రామాలలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించా రు. పొలంపల్లి గ్రామంలో ఉన్న సియే ను మినిస్ట్రీ పార్థన మందిరంలో పాస్టర్ రాజశేఖర్ తొలుత గుడ్ ఫ్రైడే సంకీర్తనలు ఆలపించారు.

గుడ్ ఫ్రైడేను ఉద్దేశించి తాను మాట్లాడుతూ, ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణం పణంగా పెట్టి సర్వ మానవాళి రక్షణ కోసం త్యాగం చేసిన మహనీయుడు ఏసుక్రీస్తని కొనియాడారు. పాపాలను విడిచి పెట్టి సత్యంలో నడవాలని బోధించిన సత్య వాక్యం బైబిల్ అని అన్నారు.