18-04-2025 08:47:01 PM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రైస్తవ సోదరులు ఉపవాస ప్రార్ధనలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించారు. ఈ సందర్బంగా పాస్టర్ రెవ.బంటు జెర్మీయా మాట్లాడుతూ... క్రీస్తు ప్రేమ, త్యాగం, క్షమమనందరికి అనుసరణీయమన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు జీవితాన్ని గుర్తు చేసుకోవటం ప్రపంచ మానవాళి కోసం ఆయన పడిన తపన ప్రజలందరికీ గుర్తు చేయటం గొప్ప విషయమన్నారు. క్రీస్తు జీవితాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు రవి, రాజరత్నం, సంజీవయ్య, కిషోర్, సంధ్య, రీటా, మధుసూదన్ లు పాల్గొన్నారు.