calender_icon.png 19 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

18-04-2025 08:13:19 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజర, పినపాక పట్టి నగర్, ముసల మడుగు, కృష్ణ సాగర్ తదితర గ్రామాల్లో క్రైస్తవ సోదరులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవ ఆరాధకులు,అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.