18-04-2025 06:55:30 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్.సి.యం చర్చ్ పాస్టర్ సెబాస్టియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చింతిర్యాల క్రాస్ రోడ్ నుండి అశ్వాపురం మెయిన్ రోడ్ , బస్టాండ్ సెంటర్ మీదుగా ప్రభుత్వ హై స్కూల్ వరకు భక్తి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భక్తులు శిలువను మోస్తూ ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, శాంతి, ప్రేమ, క్షమ యొక్క సందేశాలను జనాలకు వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్.సి.యం, సి.ఎస్.ఐ చర్చిలకు చెందిన అనేకమంది భక్తులు పాల్గొన్నారు.