18-04-2025 06:36:08 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం, మునగాల మండల కేంద్రంలోని పెనుయేలు వర్షిప్ సెంటర్ లలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. తొలుత గుడ్ ఫ్రైడే సంకీర్తనలు ఆలపించారు. గుడ్ ఫ్రైడేను ఉద్దేశించి పెనుయేలు సంస్ధ అధ్యక్షులు పాస్టర్ జె జె సామ్యూల్ సన్ మాట్లాడుతూ... ప్రపంచ మానవాళి కోసం తనం ప్రాణం పణంగా పెట్టి తన స్వరక్తంతో మనల్ని కొని మన పాపముల నుండి విడిపించేందుకు ఈ భూమి మీదకు దైవ కుమారుడైన క్రీస్తు యేసు వచ్చి సర్వ మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టి మనల్ని ఈ లోక పాపముల నుండి యేసుక్రీస్తు విడిపించాడని, యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన చివరి ఏడు మాటలు ఆయన సంఘంలో భోదించాడు.
మన నుండి ఏమి ఆశించకుండా మన మనస్సు మార్చుకోమని చెప్పిన గ్రంధం, పాపాలను విడిచి పెట్టి సత్యంలో నడవాలని బోధించిన సత్య వాక్యం బైబిల్ అని సుదర్శనం అన్నారు. అందరూ మారుమనస్సు పొంది బైబిల్ మార్గంలో నడవాలని అన్నారు. మండలంలోని అన్ని పెనుయేలు సంఘాలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవి, భారతమ్మ, సువార్తమ్మ, వీరబాబు, మేరీ, మాణిక్యమ్మ, రాజేష్, సరోజని తదితరులు పాల్గొన్నారు.