18-04-2025 08:32:45 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాహుజరాబాద్ పట్టణంలోని అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ చర్చిలో గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే అనగా ఏమిటి గుడ్ ఫ్రైడే కు ఉన్న ప్రత్యేకతను ప్రారంభ ప్రార్థనతో డోర్కారాణి నాగిశెట్టి వివరించారు. అనంతరం దైవజేనులు రేవ. దానియేలు నాగీశెట్టి మాట్లాడుతూ... లోక మానవలి పాపము కొరకు యేసుక్రీస్తు తన శరీరము క్రేయధనముగా సిలువలో ప్రాణం పెట్టారని వివరించారు. సిలువలో యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు సంఘ సభ్యులు వివరించారు. జగతికి శాంతి సందేశానిస్తూ క్రీస్తు సిలువనెక్కిన రోజు శాంతియుత సమాజం కోసం సన్మార్గ జీవనాన్ని మానవ జాతికి తెలియజేయడం కోసం సిలువ నెక్కి క్రీస్తు తన రక్తాని చిందించీన రోజు గుడ్ ఫ్రైడే అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఆగాపే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.