calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండ కోడిమ గ్రామంలో సిలువ మార్గం

18-04-2025 05:00:20 PM

 భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే..

వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రంలోని వైరా కొండ కోడిమ గ్రామాలలో  గుడ్ ఫ్రైడే వేడుకను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వైరా పట్టణం కొండ కుడిమ గ్రామంలో  కల్వరి గుట్ట వద్ద  క్రీస్తు సిలువ మార్గం  ద్వారా  క్రైస్తవ సోదరులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ తో పాటు క్రైస్తవ మత పెద్దలు రాజకీయ పార్టీల నాయకులు  క్రీస్తు సిలువను మోసి  ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు జీవితాన్ని గుర్తు చేసుకోవటం. ప్రపంచ మానవాళి కోసం ఆయన పాటుపడిన తపన ప్రజలందరికీ గుర్తు చేయటం  గొప్ప విషయమని అన్నారు. క్రీస్తు జీవితాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువ మార్గంలో పాల్గొన్న భక్తులందరికీ  మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.