06-03-2025 01:06:21 AM
వాషింగ్టన్, మార్చి 5: అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలి కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన వివి ధ అంశాల గురించి మాట్లాడారు. ‘పౌరులారా అమెరికాకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఈ 43 రోజుల్లోనే ఎన్నో పనులు జరిగాయి.
కొన్ని దేశాలు దశాబ్దాల నుంచి మనపై సుంకాలు వేస్తున్నాయి. ఈ సుంకాలతో మనం ఎంతగానో నష్టపోయాం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మన మీద ఏ దేశం ఎంత పన్నులు విధిస్తుందో అంత మనం విధించబోతున్నాం. ఈ సుంకాల వల్ల అమెరికా మరోమారు సంపన్న దేశంగా మారబోతుంది. గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశా. అనేక చర్యలు చేపట్టా.
నా చర్యలతో అమెరికా మళ్లీ గాడిన పడుతోంది’. అని అన్నారు. అంతే కాకుండా ప్రతీకార సుంకాల విషయం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. ప్రతీకార సుంకాలతో దేశం మరోమారు సంపన్నదేశంగా మారడం ఖాయమని ఆయన అభి ప్రాయపడ్డారు. అంతే కాకుండా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కష్ పటేల్, డోజ్ సారధి మస్క్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. వారిద్దరూ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.
సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్‌గా 13 సంవత్సరాల చిన్నారి
అమెరికా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్‌గా 13 సంవత్సరాల చిన్నారిని అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ట్రంప్ ఇలా ప్రకటించగానే సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ సీన్ కరన్ ఆ బాలుడికి ఐడీని అందజేశారు. దీంతో ఆ బాలుడు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఇక ట్రంప్ ద్రవ్యో ల్బణం గురించి మాట్లాడారు.
‘మన కాళ్ల కింద లిక్విడ్ బంగారం (చమురు, గ్యాస్ తదితరాలు) ఉన్నాయి. వీటిని తోడుకుని ఖర్చులను గణనీయంగా తగ్గించుకుందాం. బైడెన్ పాలనాకా లంలో 100కు పైగా ఇంధన ప్లాంట్లను మూసేశారు. ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రయ త్నాలు చేస్తున్నాం.“డ్రిల్ బేబీ డ్రిల్” అన్నారు.
మస్క్ పనితనం భేష్..
డోజ్ అధినేత ఎలాన్ మస్క్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. ఆయన పనితనం బాగుందని ప్రశంసించారు. అధ్యక్షుడు మస్క్‌ను పొగుడుతుంటే రిపబ్లికన్ సభ్యులంతా చప్పట్లతో ఆయన్ను అభినందిం చారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా.. డెమోక్రటిక్ సభ్యుడు ఒకరు ట్రంప్‌కు వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా నిరసన తెలిపారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.